ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి ఆనందయ్య మందు.. !

కరోనా పేరుకు మూడు అక్షరాలే గానీ ప్రపంచాన్నే శాసించే స్దాయికి చేరుకుంది.ఎన్నడు మూగబోని వ్యవస్దను ఆగిపోయేలా చేసింది.

గడియారంలోని ముల్లు తప్ప ఈ ప్రపంచం మొత్తం కొన్ని నెలల పాటు పూర్తిగా స్దభించి పోయింది ఈ వైరస్ వల్ల.కేవలం మనుషులు ఊపిరి తీసుకుంటే చాలు బ్రతికినట్లే అనేలా భయానికి గురిచేసింది.

Coming Soon Anandayya Medicine Available Online Nellore, Anandaiah, Medicine, On

ఇంతటి భయంకరమైన రక్కసితో పోరాడటానికి ప్రపంచదేశాలు అహర్నిశలు శ్రమించాయి.ఇంకా శ్రమిస్తున్నాయి.

కానీ ఈ వైరస్‌ను పూర్తిగా అంతం చేసే మందు మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి తేలేక పోయాయి.ఇలాంటి సమయంలో ఒక మామూలు ఆయుర్వేద వైద్యుడు కరోనాను అంతం చేసే మందు కనిపెట్టడం ఒక్క సారిగా సంచలనంగా మారింది.

Advertisement

ఈ మందు పై ఎన్నో విమర్శలు, వివాదాలు తేనెతీగల్లా ముసిరాయి.చివరికి ఆనందయ్య మందు కరోనా బాధితులకు నిరభ్యంతరంగా అందించవచ్చనే పిలుపు వచ్చింది.

అయితే కంట్లో వేసే చుక్కల మందు తప్ప మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.అంతే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్న కరోనా రోగులకు ఆనందయ్య ఆయుర్వేద మందును ఆన్‌లైన్‌లో అందజేస్తామని తీపికబురు అందజేసింది ఇక త్వరలో ఈ ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభిస్తామని తెలుపుతుంది.

Advertisement

తాజా వార్తలు