అధికారులతో భూ సేకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వి.పి.గౌతమ్..

ఖమ్మం జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

గౌతమ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో భూ సేకరణ ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3వ రైల్వే లైన్, ఆర్వోబి, నేషనల్ హైవే, సింగరేణి కాలరీస్ కంపెనీల అవసరాల నిమిత్తం భూ సేకరణ ప్రక్రియ చేపట్టుట జరుగుతుందన్నారు.కొండపల్లి-కాజీపేట సెక్షన్ ల మధ్య రైల్వే 3వ లైన్ నిర్మాణం కొరకు ఆర్ అండ్ బి రోడ్డు రిహాబిలిటేషన్ పనులు జెఎంఎస్ సర్వే రిపోర్ట్ పూర్తి చేయాలన్నారు.కొండపల్లి-కాజీపేట మధ్య 134.16 ఎకరాల భూసేకరణకు గాను 31.12 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసినట్లు, మిగతా భూసేకరణ సెప్టెంబర్ 17 లోగా అవార్డు స్టేజ్ పూర్తి చేయాలన్నారు.ఆర్వోబి ల నిర్మాణానికి భూసేకరణకు తహసీల్దార్, ఎంపిడిఓ, సంబంధిత ఏఇ లు సంయుక్త పరిశీలన చేయాలన్నారు.నేషనల్ హైవే ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ కు 1356.2025 ఎకరాల భూసేకరణకు గాను 1282.2650 ఎకరాల సేకరణ పూర్తిచేసి, రూ.340.82 కోట్ల పరిహారం చెల్లించినట్లు ఆయన తెలిపారు.కోదాడ-ఖమ్మం హైవే భూ సేకరణ పూర్తిచేసినట్లు, కట్టడాల పరిహారం చెల్లింపులు జరుగుతున్నట్లు ఆయన అన్నారు.

వరంగల్-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ జెఎంఎస్ సర్వే పూర్తయినట్లు, సెప్టెంబర్ నెలాఖరులోగా 3డి నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలన్నారు.సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు కొరకు 1717.34 ఎకరాల భూసేకరణ చేయాల్సి వుండగా, 1570.16 ఎకరాలు పూర్తయినట్లు, మిగులు సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.భూముల్లో చెట్లు ఉన్నచోట, అటవీశాఖను సంప్రదించి, అనుమతులు పొంది తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

సత్తుపల్లి మండలం రాజోలు గ్రామంలో సింగరేణి కొరకు భూసేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఇర్రిగేషన్ ఎస్ఇ శంకర్ నాయక్, సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?
Advertisement

Latest Latest News - Telugu News