విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి..కలెక్టర్ అనురాగ్ జయంతి

సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శన రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకాంక్షించారు.

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ స్కూల్ కాంప్లెక్స్ స్థాయి సిరిసిల్ల పట్టణం కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా 154 ఎగ్జిబిట్లు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు రూపొందించిన *హ్యూమన్ హెల్పింగ్ రోబోట్, ఆటో హోమ్ మిషన్, ఆర్ ఎఫ్ఐడీ అటెండెన్స్, రెయిన్ వాటర్ స్టోరేజ్, లెట్ డెత్ పీపుల్ అలర్ట్, చంద్రయాన్ తదితర ప్రాజెక్ట్ లను కలెక్టర్ పరిశీలించి, వాటి ఉపయోగం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టుల తయారీకి సహకరించిన గైడ్ టీచర్స్, ప్రాజెక్టులను వివరించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

Advertisement

విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.చదువులోనూ రాణించాలని పేర్కొన్నారు.

విజేతలు వీరే ఆర్ఎఫ్ఐడీ అటెండెన్స్ సిస్టం.చేర్యాల శివతేజ వడ్డేపల్లి లవన్ కుమార్, హ్యూమన్ హెల్పింగ్ రోబోట్.

జీ సాయి తేజ, అజయ్, ఆటో హోమ్ మిషన్.బీ అఖిల, జాబిల్లి,రెయిన్ వాటర్ స్టోరేజ్ సిస్టం.

శివ,దత్రిష్,వివేక్, డెఫ్ పీపుల్ అలర్ట్ సిస్టం.రాజేశ్వరి, వర్షిత ఉన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, కౌన్సిలర్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, మండల విద్యాధికారి దూస రఘుపతి, పాఠశాల స్టాప్ సెక్రెటరీ మల్లారపు పురుషోత్తం, సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ సరిత, శ్రీహరి, రజిత, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News