మాతృత్వ రక్షణ కాల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలను పెంచే దిశగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డి ఎం ఎచ్ ఒ డాక్టర్ సుమన్ మోహన్ రావు , మాతృత్వ రక్షణా అనే కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సెంటర్ ద్వారా గర్భిణీ స్త్రీలు 8వ నెల నుండే వారి ప్రసవాల గురించి జాగ్రత్తల గురించి ప్రభుత్వ ఆసుపత్రులలో వారికి కల్పించే వసతుల గురించి అనగా గర్భిణీలకు వ్యాక్సినేషన్ ,ఏఎన్సి చెకప్ లు, స్కానింగ్లు, టెస్టులు, రక్తహీనత కలిగిన వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న అత్యాధునికమైన, అత్యవసర వైద్య పరికరాలు, అత్యవసర సమయంలో బ్లడ్ బ్యాంకు, 24 గంటలు నిపుణులైన వైద్య సిబ్బంది, డెలివరీ తర్వాత వారికి లభించే కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకం గురించి వివరించడం జరుగుతుంది.

మరియు అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ మెడిసిన్స్ మరియు న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఈ నంబర్స్ 7396553254,9121842941,కి కాల్ చేయడం ద్వారా అందించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News