ఆవునూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఆవునూరు గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి భానుచందర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి లు కలిసి అందించారు.ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన ఉమ్మనవేణి లావణ్యకి రూ.

25వేలు , అల్వాల వేణుకు రూ.29,500వేలు , గట్ల జ్యోష్న రూ.32.500వేల చెక్కులు మంజూరు కాగా వాటిని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చేపూరి రాజయ్య, కనమేని పద్మ రెడ్డి, సతీష్ చందర్ రావు, కుంబాల మల్లారెడ్డి, మంత్రి రఘు,కనమేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల రాజు, జక్కుల నర్సయ్య, ప్యారం సింహాద్రి, బోయిని రవి, ప్యారం రాంబాబు, పిట్ల చెంద్రయ,సోషల్ మీడియా వారియస్ దాసరి విశ్వనాధం పాలొగొన్నారు.లబ్ధిదారులు సీఎం కెసిఆర్ కి,మంత్రి కెటిఆర్ కి కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలిపారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News