సీఎంవో పిలుపు- హడలిపోతున్ననేతలు ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) ఆఫీస్ నుంచి పిలుపు వస్తే చాలు ఎమ్మెల్యేలు, మంత్రులు హడలిపోతున్నారట.

ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు తప్పనిసరిగా తిరగాలని ఇప్పటికే ముఖ్యమంత్రి హుకుం జారీ చేశారు.

అంతేకాకుండా ప్రజా సంక్షేమ పథకాలు అమలు ఎలా జరుగుతుందో పర్యవేక్షించే బాధ్యత కూడా ఆయా నేతల పైనే ముఖ్యమంత్రి పెట్టారు .అలాంటప్పుడు నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేని ఎమ్మెల్యేలను , మంత్రలను( MLAs , Ministers ) పిలిపించి క్లాస్ పీకుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో టికెట్లు అంతా తాను సర్వేల ద్వారానే నిర్ణయించుకుంటానని, ప్రజలలో గ్రాఫ్ పెంచుకోలేని నాయకులు వారు ఎంతటి వారైనా సరే టికెట్లు ఇచ్చేది లేదని ఇంతకు ముందు జరిగిన సమీక్ష సమావేశం లోనే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు .

దాంతో ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బలవంతంగా నైనా గ్రామాలు తిరుగుతున్నారు.మౌలిక సదుపాయాల విషయంలో గాని రోడ్ల నిర్మాణం విషయాలలో గాని పెండింగ్ పనుల నిధుల రిలీజ్ అవ్వకపోవడం వంటి విషయాలలో ప్రజల నుంచి స్థానిక నాయకులు నుంచి వస్తున్న ఫిర్యాదులను, ఆగ్రహాన్ని తట్టుకోలేక కొంతమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు .అలాంటి వారందరికీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు రావడంతోనే హడలు పుడుతుందని తెలుస్తుంది.

అయితే ప్రతిదానికి సర్వేలపైనే ఆధారపడుతూ తమ మాటకు విలువ లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయం ఎమ్మెల్యేలలో ఉన్నప్పటికీ తెగించి మాట్లాడే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదు దాంతో ఫోన్ వస్తే ఆఫీసులో ఏం మాట్లాడాలో తేలిక టెన్షన్ తో చాలామంది నేతలకు నిద్ర కూడా పట్టడం లేదని వార్తలు వస్తున్నాయి .మరి కొంతమంది అయితే తాము సంతృప్తికర స్థాయిలోనే నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ కూడా వాటిని సరైన రీతి లో రిపోర్ట్ లు ముఖ్యమంత్రి కి చేరవేయడం లేదని అందుకే తమపై అధినేత ఆగ్రహం తో ఉన్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు మరి సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వస్తే తప్ప ఈ చర్చకు పుల్ స్టాప్ పడేలా లేదు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

తాజా వార్తలు