CM Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

ఇందులో ప్రధానంగా రెండో జాబితా ఎంపీ అభ్యర్థుల జాబితాపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.కాగా లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే నాలుగు స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.అయితే సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకుని ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాలని యోచిస్తోంది.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు