పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుండి బీజేపీ వర్సెస్ మమతాబెనర్జీ అన్నట్టు రాజకీయ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో బిజెపి మమతా బెనర్జీని గట్టిగా టార్గెట్ చేయగా ఆమె కూడా బిజెపికి దీటుగా ఎత్తుగడలు వేసి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి మరోసారి సీఎం అయ్యారు.
అయినా కానీ బిజెపి పెద్దలతో నువ్వానేనా అన్నట్టుగా మమతా బెనర్జీ వ్యవహరిస్తూ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటమిపై పలు విషయాలపై గట్టిగా వారిపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ‘పెగాసస్’ స్పైవేర్” వ్యవహారం.పార్లమెంటు, రాజ్యసభలో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో ఈనెల 28వ తారీకు ప్రధాని మోడీతో చర్చించడానికి మమతా బెనర్జీ రెడీ అయ్యారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు.‘పెగాసస్’ స్పైవేర్ వ్యవహారం సభలను కుదిపేస్తున్న సమయంలో.మోడీతో మమతా బెనర్జీతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉంటే ఇది అధికారిక పర్యటన అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.