ఏపీలో ఇక 1,1,1,7... ? ఇదే..కొత్త‌.. బిగ్ ఛేంజ్ ?

ఏపీ సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాల‌తో మార్క్ బిగ్ ఛేంజ్ మొద‌లెట్టేశారా అంటే ? అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.ప్ర‌స్తుతం 13 జిల్లాలు ఉన్న ఏపీని 26 జిల్లాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 1 1 1 7 In Ap Big Change Allotting New Mps And Mlas In Ap New Districts Details,-TeluguStop.com

జిల్లాల‌ను ఎంపీ సీటు ప్రాతిప‌దిక‌న రూపురేఖ‌లు తీర్చిదిద్దారు.ఎంపీ సీటు అంటే ఖచ్చితంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి.

అంటే ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రి, ఒక్కోఎంపీ, వారిచుట్టూ ఏడుగ‌రు ఎమ్మెల్యేలు ఉంటార‌న్న‌ మాట‌.ఇదే ఏపీలోని కూర్పు, మార్పు అన్న‌మాట‌.

కొత్త జిల్లాలు గా ఏర్పాట‌య్యేవ‌న్నీ చిన్న జిల్లాలే.సో రాజ‌కీయంగా గొడ‌వ‌లు పెద్ద‌గా ఉంవ‌ని వైసీపీ భావిస్తోంది.26 జిల్లాలు అంటే 26మంది మంత్ర‌లు ఉంటారు.అయితే వారు ఎవ‌ర‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌.

అయితే ఏపీలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి రాబోతున్నాయి.మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కూడా ఇదే ఉగాది డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మ‌చారం.

అయితే కొత్త జిల్లాలు అంటే స‌మ‌స్య‌లు బోలెడుంటాయి.వాటిని ఎలా ప‌రిష్క‌రించే బాధ్య‌త కూడా కొత్త మంత్రుల‌పైనే ఉంటుంది.

కొత్త జిల్లాలు, కొత్త మంత్రుల రాక‌కు స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.దీంతో ఏపీ అంత‌టా సంద‌డి నెల‌కొంది.

అయితే కొత్త జిల్లాల‌కు క‌లెక్ట‌ర్ల‌తో పాటు మంత్రులు ఎవ‌రొస్తారు ? ఎవ‌రెవ‌రిని వైసీపీ నియ‌మిస్తోంది ? అనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.కాగా గ‌తంలో పెద్ద జిల్లాకు ఇద్ద‌రు మంత్రుల‌ను తీసుకున్నా….

ఆ ఇద్ద‌రు ఒకే జిల్లా కేంద్రంలోనే ఉండ‌డంతో ఆధిప‌త్య పోరు ఉండేది.దీనిని తుద‌ముట్టించేందుకు నూత‌న జిల్లాల‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు.

దీంతో రాజ‌కీయ విభేదాలకు తావుండ‌ద‌ని భావిస్తున్నారు.

Telugu Apcm, Ap, Ap Ministers, Ap Latest, Jagan Ministry, Mps Mlas, Ycp Master-P

ఇక ఎంపీల విష‌యాని కొస్తే ఎంపీలతో ప‌డేది కాదు.కొత్త జిల్లాల ఏర్పాటుతో వారి స‌మ‌స్య ఉండ‌దు.ఉన్న ఒక్క మంత్రి తోనే స‌ర్ధుకుంటే స‌రిపోతుంది.

మొత్తానికి జ‌గ‌న్ కూర్పుతో వైసీపీని మ‌రింత బ‌లోపేతం చేయొచ్చ‌నే యోచ‌న‌లో వైసీపీ అధినాయ‌క‌త్వం ఉంది.ఇలా ఏ విష‌యంలో నైనా ఏపీ మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు.

దీంతో రానున్న రెండేండ్ల‌లో కొత్త జిల్లాల‌పై రాజ‌కీయ ఆధిప‌త్యం చ‌లాయించ‌డానికి కూడా ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయి.మ‌రి వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ స‌క్సెస్ అవుతుందా ? లేదా ? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube