రేపు భద్రాచలానికి సీఎం కేసిఆర్.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసిఆర్

ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా వ‌రద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించనున్నారు.అక్క‌డ జ‌రుగుతున్న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కేసీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించనున్నారు.

వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన క‌ష్ట‌న‌ష్టాల‌ను సీఎం ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోనున్నారు.అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు.

అధికారులు నిర్దేశించిన‌ ప్రాంతాల్లో పర్యటించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కేసీఆర్ సమీక్షించిన తరువాయి వరదల అనంతర పరిస్థితులను అంచనావేసి విద్యుత్తు, రోడ్లు, తాగునీరు, పంటలు తదితర రంగాల్లో జరిగిన నష్టాలను అంచనావేసి తగు చర్యలు తీసుకోనున్నారు.వరదల్లో అంటువ్యాధులు సోకకుండా అందే వైద్యసాయం గురించి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.

Advertisement
కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?

Latest Khammam News