నాగర్‌కర్నూల్‌ సభలో ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

నాగర్‌కర్నూల్‌ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్( CM KCR ) ధరణి పోర్టల్ కార్యక్రమం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ.దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేయడం జరిగింది.

పాలమూరు జిల్లా( Palamoor ) సాగునీటికి, తాగునీటికి ఒకప్పుడు ఎంతో ఇబ్బంది పడేదని వ్యాఖ్యానించారు.గతంలో రెండు పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించాయి.

పాలమూరును ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారు.అంతేకాదు నాకంటే ఎత్తుగా బలంగా ఉన్న వాళ్ళు మంత్రులుగా కూడా ఉండేవాళ్లు.

Advertisement

కానీ ఎవరూ కూడా మంచినీళ్లు ఇవ్వలేకపోయారు.

అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.మిషన్ భగీరథ ద్వారా కృష్ణమ్మ నీళ్లు వస్తున్నాయి.మహబూబ్ నగర్ జిల్లాలో.

.ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక ఇదే సమయంలో ధరణి పోర్టల్ కార్యక్రమం పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎవరో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆ విధంగా వ్యవహరిస్తే రైతులను బంగాళాఖాతం( Bay of Bengal )లో వెయ్యడమేనని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారు.

Advertisement

ధరణి రాకముందు అంతా లంచాల మయంగా ఉండేది.ధరణితో అధికారుల వద్ద ఉన్న అధికారాన్ని ప్రజలకు ఇవ్వటం జరిగింది.

రెవిన్యూ రికార్డులు మార్చే అధికారం ఇప్పుడు సీఎం అయినా నాకు కూడా లేదు.ధరణి పోర్టల్ కార్యక్రమంతో పైరవీలు, లంచాలకు అడ్డుకట్ట పడింది.

ఇటువంటి మంచి కార్యక్రమం అయిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నా నాయకులను వచ్చే ఎన్నికలలో అదే రీతిలో కలిపేయాలి అని నాగర్ కర్నూల్ సభలో ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు