నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ ప్రగతిభవన్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.నిన్న జరిగిన కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు వివరించారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసుల నివేదిక ఆధారంగా స్పందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, మధ్యాహ్నం తర్వాత కేసీఆర్, నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

తాజా వార్తలు