వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.తాడేపలి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.

ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వివరాలు తెలుసుకోనున్నారు.అదేవిధంగా ఎమ్మెల్యే పనితీరును తెలుసుకోనున్న ఆయన ఐ ప్యాక్ ఇచ్చే నివేదిక ఆధారంగా జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలానే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.ముందస్తు ప్రచారంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 23 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు.ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజా సమస్యలను నేతలు స్వయంగా తెలుసుకోనున్నారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

Latest Latest News - Telugu News