దడ పుట్టిస్తున్న జగన్ ! లిస్ట్ లో ఇంతమంది మంత్రులా ? 

ఏపీలో రాజకీయ సంచలనానికి తెర తీశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్.

( CM Jagan ) వచ్చే ఎన్నికలను దృష్టిలో లో పెట్టుకుని ఇప్పటి నుంచే నుంచే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు.

  గెలిచే అవకాశం ఉన్నవారికి టికెట్లు అని కాన్సెప్ట్ను తెరపైకి తీసుకువచ్చారు.పనితీరు సక్రమంగా లేనివారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జిలను మొహమాటం లేకుండా తప్పించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.

  వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వారెవరు అసంతృప్తికి గురవద్దని,  సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేపడుతున్నామని , మళ్లీ వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవులు ఇస్తామని , తనను అర్థం చేసుకోవాలని జగన్ సూచిస్తున్నారు.ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.

దాదాపు 70 నుంచి 80 స్థానాల్లో మార్పు చేర్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది .వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన( TDP Janasena ) కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వస్తూ ఉండడం, వైసిపి ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా  సర్వేల ద్వారా అంచనాకు వచ్చిన జగన్ ఈ భారీ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.టిడిపి జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉండడం ,  కొన్ని కీలకమైన జిల్లాల్లో తమకు తీవ్ర ఎదురుగాలి వీస్తోంది అని జగన్ అంచనా వేస్తున్నారు.

Advertisement

  అందుకే దానికి తగ్గట్లుగానే బలమైన అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే 11 మంది మంత్రులు, ఎమ్మెల్యే ల నియోజకవర్గాలను మార్చారు.  త్వరలోనే మరో 35 నియోజకవర్గాల్లోనూ మార్పు చేర్పులు చేపట్టబోతున్నారు.  ప్రస్తుత మంత్రులలో దాదాపు పదిమంది కి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు( YCP Tickets ) దక్కడం అనుమానంగానే ఉన్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి .దీంతో ఆ లిస్టులో ఉన్న మంత్రులు ఎవరు అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.చిత్తూరులో ఇద్దరు,  కడపలో ఒకరు,  కర్నూలులో ఒక మంత్రికి టికెట్ దక్కి అవకాశం లేదట.

  అలాగే ఉభయగోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కష్టమేననే సంకేతాలు జగన్ ఇప్పటికే ఇచ్చారట.గుంటూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులకు టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.

ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు ,( Dharmana Prasada Rao ) బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ఎంపీలుగా పోటీ చేయాలని జగన్ సూచించారు.మంత్రులు కూడా టికెట్ దక్కడం కష్టమైన అన్న ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత మంత్రులే కాకుండా ఎంపీలు , ఎమ్మెల్యేలు చాలామందిని పక్కన పెట్టాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట .పూర్తిగా సర్వే నివేదికలు , ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఆధారంగా చేసుకుని ఈ భారీ మార్పులకు జగన్ శ్రీకారం చుట్టడంతో,  ఎవరి సీటు ఉంటుందో ?  ఎవరి సీటు గల్లంతవుతుందో తెలియక వైసిపి ఎంపీలు,  ఎమ్మెల్యేలు ప్రస్తుతం మంత్రులు టెన్షన్ లో ఉన్నారట.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు