మ‌ధుమేహులు వింట‌ర్‌లో ల‌వంగాలు తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో ఎన్నెన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ్యంగా మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులకు వింట‌ర్ సీజ‌న్‌లో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం క‌త్తి మీద సామే.చ‌లి కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా తగ్గడం వ‌ల్ల‌ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరిగి పోతాయి.

దాంతో వాటిని అదుపులోకి తెచ్చుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే వింట‌ర్‌లో చ‌క్కెర స్థాయిల‌ను కంట్రోల్ చేయ‌డానికి ల‌వంగాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే ల‌వంగాల్లో బోలెడ‌న్ని పోష‌కాలూ నిండి ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.అందుకే ఆరోగ్య ప‌రంగా ల‌వంగాలు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

Advertisement

ముఖ్యంగా చ‌లి కాలంలో మ‌ధుమేహులకు ల‌వంగాలు ర‌క్ష‌ణ క‌వ‌చాలుగా మార‌తాయి.అవును, ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ల‌వంగాల‌ను తీసుకుంటే చాలా సుల‌భంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులోకి తెచ్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లి పోదం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్‌లో గ్లాస్ వాట‌ర్‌, అర స్పూన్ ల‌వంగాల పొడి క‌లిపి పావు గంట పాటు మ‌రిగించాలి.ఆ త‌ర్వాత మ‌రిగించిన నీటిని ఫిల్ట‌ర్ చేసుకుని నిమ్మ ర‌సం క‌లిపి గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.చ‌లి కాలంలో మ‌ధుమేహం ఉన్న వారు ఉద‌యం పూట టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ ల‌వంగం నీరును తీసుకుంటే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.అంతే కాదు, వింట‌ర్‌లో ల‌వంగాల‌ను పైన చెప్పిన విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ అవుతారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.

Advertisement

మ‌రియు చ‌లిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది.

తాజా వార్తలు