అంబేద్కర్ విగ్రహాలను శుభ్రపరిచి,రంగులువేసి అలంకరించండి:- జిల్లా పంచాయితీ అధికారి ఆదేశం

రాష్ట్ర ఎస్సి,ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం వారి విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల అనుసారం ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను శుభ్రపరిచి,కొత్త రంగులు వేసి అలంకరించేలా చర్యలు చేపట్టాలని పంచాయితీ కార్యదర్శులను, సర్పంచ్ లను ఖమ్మం జిల్లా పంచాయితీ అధికారి ఆదేశించారు.

ఈ నెల 14 న అంబేద్కర్ జయంతి నీ పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పంచాయతీలో 14 లోపు పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

గడువులోపు పంచాయతీల్లో పనులు పూర్తి అయ్యేలా మండల పంచాయితీ అధికారులు,డివిజనల్ పంచాయితీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి నివేదికలు జిల్లా కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

Latest Khammam News