చైనాలో ప్రత్యేక ఆకర్షణగా సింక్‌హోల్.. ఎవరూ ఊహించనంత సైజులో

చైనాలో ఒక అరుదైన పురాతన అడవి బయటపడింది.అది కూడా ఒక సింక్‌హోల్‌లో! సాధారణంగా నీటి ప్రవాహం ఉదృతంగా వచ్చినప్పుడు కొన్ని చోట్ల సింక్‌హోల్‌లు ఏర్పడతాయి.

లేదా మరే ఇతర కారణాల వల్లనైనా భూమిలో గుంట ఏర్పడుతుంది.అయితే చైనాలో మాత్రం భూమిలో ఏర్పడిన ఒక రంధ్రం ఎవరూ ఊహించనంత పెద్దగా ఉంది.

గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లోని లేయ్ కౌంటీలోని సింక్‌హోల్‌ మే 6న గుహ అన్వేషకులు కంట పడింది.ఇది 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్‌ల్లో అతి పెద్దది గా నిలుస్తోంది.

ఈ సింక్‌హోల్‌లో ఒక దట్టమైన పెద్ద అడవి పెరిగిపోయింది.ఈ అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్లు, ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయిన మొక్కలు ఇంకా రకరకాల జీవులు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Advertisement

ఈ సింక్‌హోల్‌లో 131 అడుగుల (40 మీ) పొడవైన పురాతన చెట్లు ఉన్నాయి.సింక్‌హోల్ ప్రవేశద్వారం ద్వారా వైపు వాటి కొమ్మలు పెరిగాయి.

ఈ అడవి చూసేందుకు చూడచక్కగా ఉంది.దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.ఈ ప్రకృతి అద్భుతాలను మీరు కూడా చేయండి.

కొత్తగా కనిపెట్టిన ఈ పెద్ద సింక్‌హోల్‌తో చైనాలో సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరుకుంది.శుక్రవారం అంటే మే ఆరో తేదీన గుహ అన్వేషకులు తమ యాత్ర పూర్తి చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

బృంద సభ్యులు గొయ్యి దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు ట్రెక్కింగ్ చేశారు.శుక్రవారం సాయంత్రానికి క్షేమంగా సింక్‌హోల్‌ కిందకు వెళ్లగలిగారు.

Advertisement

సింక్ హోల్స్ ఒక అరుదైన భౌగోళిక ఘటన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇలాంటి ప్రత్యేకతను గల పెద్ద సింక్‌హోల్‌ వెలుగులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇందులోని పురాతన అడవిలో సరికొత్త జాతుల జంతువులు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఇదంతా కూడా నేచర్ ప్రేమికులను బాగా ఉత్తేజపరుస్తోంది.

దీని గురించి మరింత తెలుసుకునేందుకు నేచర్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు