చిరంజీవి కంటే ఎన్టీఆర్‌ దే పై చేయి.. ఇదే సాక్ష్యం

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్లుగా చర్చ జరుగుతోంది.అయితే ఈ చర్చ నందమూరి మరియు మెగా హీరోల సినిమాలకు సంబంధించినది కాదు.

ఈ చర్చ మెగా హీరో మరియు నందమూరి హీరో వేరు వేరుగా బాలీవుడ్ సినిమాలకు ప్రమోటర్ గా వ్యవహరించగా ఆ సినిమాలు నిరాశపరచడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బాలీవుడ్ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను సమర్పించిన విషయం తెలిసిందే.తెలుగులో చిరంజీవి సమర్పించిన కారణంగా ఆ సినిమా కు మంచి బజ్‌ క్రియేట్ అయింది.

కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది.ఇక ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర సినిమా ను సమర్పించలేదు కానీ.

Advertisement

ఆ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని సినిమా యొక్క హైప్ క్రియేట్ అవ్వడంలో తన వంతు పాత్రను పోషించాడు.అమీర్ ఖాన్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఐరన్ లెగ్ అంటూ కొందరు విమర్శలు చేశారు.

ఇప్పుడు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ని కూడా కొందరు ఐరన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నారు.ఈ సమయంలో కొందరు నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చిరంజీవి సమర్పించిన సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల వసూళ్లు మరియు ఎన్టీఆర్ ప్రెస్ మీట్‌ లో పాల్గొన్న బ్రహ్మాస్త్ర సినిమా యొక్క వసూళ్ల ని పోల్చి చూస్తే ఏ హీరో గొప్ప అనే విషయం తెలుస్తుందని.

ఇప్పుడు ఆ విషయమై చర్చకు వాళ్ళు సిద్ధమా అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఈ రచ్చ ఇప్పట్లో తేలేలా లేదు.

ఇరు వర్గాల అభిమానులు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.బాలీవుడ్ సినిమాల కోసం ఇలా మన హీరోలు అభిమానులు పోటీ పడడం విమర్శలు చేసుకోవడం ఏమాత్రం బాగా లేదంటూ కొందరు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఇప్పటికైనా ఆ చర్చను వదిలేసి మన సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు