టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అదే ఊపుతో భోళా శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఇకపోతే బోలా శంకర్ సినిమాకు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
తమిళం సినిమా వేదాళం కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.
ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాకు గాను 45 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకోవాల్సి ఉంది.కానీ ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ ని అందుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
విడుదలకు ముందే రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఓవరాల్ గా జరిగే బిజినెస్ తో పాటు క్రియేటికల్ రన్ షేర్ మొత్తం చూసిన తర్వాత పర్సంటేజ్ పరంగా రెమ్యూనరేషన్ తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే నిర్మాతకు మంచి సహాయం చేసినట్లు అవుతుంది.సినిమా హిట్ హీరోగా మంచి పేరు రావడంతో పాటు నిర్మాతకు కూడా బాగా డబ్బులు వస్తాయి.కాగా చిరంజీవి నిర్ణయం బాగుంది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈ పోస్టర్లు విడుదల అయిన విషయం తెలిసిందే.భోళా శంకర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.