మామూలుగా సెలబ్రిటీలు ఫ్యాషన్ అంటూ రకరకాల డిజైన్లతో కూడిన అవుట్ ఫిట్ లు ధరిస్తూ ఉంటారు.అయితే చూడటానికి అవి డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు ఇవి ఎందుకు ధరిస్తున్నారు రా బాబు అన్నట్లుగా అనిపిస్తుంది.సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఏది వేసుకున్న చూడకుండా ఉండటం అనేది తప్పదు.
కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ధరించిన అవుట్ ఫిట్ ల క్లాత్ కూడా ట్రోల్ చేసే విధంగా ఉంటుంది.అయితే తాజాగా శ్రీముఖి ఒక స్టైలిష్ అవుట్ ఫిట్ తో తెగ షో చేసింది.
ఓ నెటిజన్ వెంటనే గాలి తీసేశాడు.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న సందడి మామూలుగా లేదని చెప్పాలి.తన మాటలతో మాత్రం ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటుంది.కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.
ప్రస్తుతం వరుస షో లతో బాగా బిజీగా ఉంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి తన యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.

తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులతో బాగా రెచ్చగొడుతూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఎల్లో కలర్ అవుట్ ఫిట్ ధరించి కొన్ని ఫోటోషూట్లు చేయించుకుంది.అయితే ఆ డ్రెస్ చూడటానికి కాస్త డిఫరెంట్ గా అనిపించింది.ఆ డ్రెస్ కు ఉన్న తోక కూడా ఏదో పక్షి తోకలాగా అనిపించింది.అయితే ఆ ఫోటోలు చూసి చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం డెకరేషన్ క్లాత్ చాలా బాగుంది అంటూ ఘోరంగా అవమనించాడు అని చెప్పాలి.మిగతా వాళ్ళు కూడా సర్కస్ డ్రెస్ లాగా ఉందని బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







