రాజశేఖర్ డ్యాన్స్ చూసి చిరంజీవి అలా అన్నారట.. అసలేమైందంటే..?

ఇండస్ట్రీలో గడిచిన 40 సంవత్సరాలుగా ఎన్నో ఘన విజయాలను సాధించి ఇప్పటికీ వరుస ఆఫర్లతో చిరంజీవి బిజీగా ఉన్నారు.

అయితే ఒక సమయంలో హీరో రాజశేఖర్ డ్యాన్స్ ను చూసి చిరంజీవి ఆశ్చర్యపోయారని సమాచారం.

హీరో రాజశేఖర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అల్లరి ప్రియుడు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయానికి హీరో రాజశేఖర్ కు, డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఉన్న ఇమేజ్ వేరు కావడంతో ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో అని ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారని సమాచారం.అయితే అల్లరి ప్రియుడు సినిమా కొరకు రాజశేఖర్ మారిపోయి రాఘవేంద్రరావు స్టైల్ సినిమాలో నటించారు.

అప్పటిదాకా యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న రాజశేఖర్ అల్లరి ప్రియుడు మూవీతో తనలోని లవర్ బాయ్ కోణాన్ని ఆవిష్కరించడం గమనార్హం.అల్లరి ప్రియుడు సినిమాకు ముందు వరకు సినిమాల్లో డ్యాన్సుల విషయంలో రాజశేఖర్ పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి అల్లరి ప్రియుడు మూవీని చూసి హీరో రాజశేఖర్ ఇంత బాగా డ్యాన్స్ స్టెప్పులను వేయగలరా అని అనుకున్నారని సమాచారం.ఈ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.హీరో రాజశేఖర్ నట జీవితంను మలుపు తిప్పిన సినిమాలలో అల్లరి ప్రియుడు ఒకటని చెప్పవచ్చు.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సాజన్ సినిమా స్పూర్తితో అల్లరి ప్రియుడు సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ సినిమాను చూసిన తర్వాత చిరంజీవి రాజశేఖర్ కు ఫోన్ కాల్ చేసి కాల్ లో అభినందించారు.ఈ మూవీ 100 డేస్ ఫంక్షన్ కు కూడా చిరంజీవి గెస్ట్ గా హాజరు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు