చిరంజీవి నెక్స్ట్ సినిమా కోసం సుకుమార్ తో చర్చలు

మెగాస్టార్ చిరంజీవి పోలిటిక్స్ నుంచి సినిమాలలో టర్న్ తీసుకొని వరుస రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో తనకి టాలీవుడ్ లో ఎప్పటికి తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు.

తనకున్న చరిష్మా ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఫిక్స్ అయిన చిరంజీవి వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాయి.

వీలైనంత వరకు ఒకప్పటి తరహాలో కమర్షియల్ కథలు కాకుండా సందేశాత్మక కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకుంటున్నాడు.అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Chiranjeevi Next Movie With Sukumar-చిరంజీవి నెక్స్

ఇందులో చిరంజీవి కార్మిక నాయకుడుగా కనిపిస్తాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాకి కావాల్సిన స్టొరీ, దర్శకుడుని ఇప్పటి నుంచి లైన్ లో పెడుతున్నాడు.

కొరటాల తర్వాత చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని భావించారు.అయితే త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసాడు.

Advertisement

దీంతో మెగాస్టార్ సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది.

అయితే సుకుమార్ తో చేయబోయే సినిమా సినిమా మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ నా లేక కొత్త కథతో వస్తాడా అనేది చూడాలి.అయితే ఎలాంటి కథతో వచ్చిన చిరంజీవి తన అనుభవంతో సినిమాని తన స్టైల్ కి తగ్గట్లు మార్చుకొని కచ్చితంగా హిట్స్ కొడతాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు