ఆ లక్ష మంది వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న చిరంజీవి.. అదే వాళ్లకు ధైర్యమంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పవన్ హరీష్ కాంబో మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ ను లీక్ చేశారు.1978 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన తొలిసారి కెమెరా ముందుకు వచ్చానని ఆరోజు నటించిన సీన్ ద్వారా మన పాత్రకు నూరు శాతం న్యాయం చేస్తే ప్రశంసలు దక్కుతాయని అర్థమైందని చిరంజీవి అన్నారు.ఆచార్య మూవీలో ఒక సీన్ లో చరణ్ యాక్టింగ్ ను చూసి నేను భావోద్వేగానికి గురయ్యానని ఆ సీన్ చూసిన సమయంలో ఎంత కఠిన హృదయం ఉన్న వ్యక్తి గుండైనా కరుగుతుందని చిరంజీవి వెల్లడించారు.

ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో మహేష్ నటిస్తున్నట్టు జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఊహాగానాలని చిరంజీవి కామెంట్లు చేశారు.నేను రాజకీయాల్లోకి వెళ్లడం తాను, చరణ్ కలిసి నటించలేమోనని సురేఖ బాధ పడిందని చిరంజీవి తెలిపారు.

సురేఖ కోరిక బలమైనది కావడంతో తాను, చరణ్ కలిసి నటించామని చిరంజీవి కామెంట్లు చేశారు.చరణ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి కష్టపడి పైకి వచ్చాడని చిరంజీవి అన్నారు.

భవదీయుడు భగత్ సింగ్ మూవీలో లక్ష మంది స్టూడెంట్స్ తో పవన్ రోడ్డెక్కుతాడని విలన్ వీడి ధైర్యం ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నాడనా అని అడగగా లేదు సార్ ఆ లక్ష మంది ముందు ఇతను ఉన్నాడని వాళ్లకు ధైర్యం అని చెబుతాడని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే ఈ డైలాగ్ కేజీఎఫ్ మూవీ డైలాగ్ లా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.భవదీయుడు భగత్ సింగ్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు