ధనుష్ మూవీ బడ్జెట్ తెలిస్తే షాక్.. అక్షరాలా రూ. 1533 కోట్లట!

జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.

 Dhanush The Gray Man Movie Budget 1533 Crores Details, Dhanush, Kollywood, Holly-TeluguStop.com

అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు.ఈయన హాలీవుడ్ లో చేసిన ది గ్రే మ్యాన్ సినిమా రిలీజ్ కూడా రెడీ అవుతుంది.

ఈ సినిమా ప్రఖ్యాతి రస్సో బ్రదర్స్ తెరకెక్కించారు.ఈ సినిమాలో ధనుష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.200 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ కరెన్సీ లో దడపా 1533 కోట్లకు సమానం.ఇటీవల కాలంలో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది.

రస్సో బ్రదర్స్ నిర్మాణ సంస్థ ఏజిబిఓ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Telugu Budget, Dhanush, Dhanush Budget, Hollywood, Kollywood, Rasso Brothers, Se

ఈ సినిమా 2022 జులై 22న నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.ఇక ధనుష్ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టు కుంటుంది.ఈ ఫస్ట్ లుక్ ను ధనుష్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసాడు.ఈ పోస్టర్ లో ధనుష్ సూపర్ హీరో తరహా ఫోజ్ పెట్టి ఎక్స్ ప్రెషన్ కూడా అదరగొట్టాడు.

దీంతో పాటు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.

Telugu Budget, Dhanush, Dhanush Budget, Hollywood, Kollywood, Rasso Brothers, Se

ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.సార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.మరి ఈ రెండు సినిమాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube