అలా చేయడంతో కాలిపోయిన చిరంజీవి చెయ్యి.. బాధను అలానే భరిస్తూ?

సినిమా రంగంలో నంబర్ వన్ హీరో స్థానానికి చేరుకోవడం, ఆ స్థానాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు.

అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం దాదాపు మూడు దశాబ్దాల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగారు.

కెరీర్ లో ఎన్నో రిస్క్ లను తీసుకోవడం వల్లే చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నారని చెప్పవచ్చు.తెలుగుతో పాటు చిరంజీవి కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

జెంటిల్ మేన్ సినిమాకు రీమేక్ అయిన ద జెంటిల్ మేన్ హిందీలో మహేష్ భట్ డైరెక్షన్ లో చిరంజీవి నటించారు.ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా హీరో భుజంపై గన్ పౌడర్ ను వేసుకుని కాల్చుకునే సీన్ ఉంటుంది.

దర్శకుడు మహేష్ భట్ ఈ సీన్ ను డూప్ తో చేద్దామని చెప్పగా తానే స్వయంగా చేస్తానని చెప్పి చిరంజీవి డూప్ తో ఆ సీన్ ను చేయించడానికి అస్సలు అంగీకరించలేదు.అయితే మహేష్ భట్ మాత్రం చిరంజీవి అలా చేస్తే తాను చూడలేనిని చెప్పి వెళ్లిపోయారు.

Advertisement

ఆ తరువాత చిరంజీవి తన తోడల్లుడు వెంకటేశ్వరరావును షూటింగ్ జరిగే ప్రదేశానికి పిలిచి నిపుణుల పర్యవేక్షణలో గన్ పౌడర్ ను భుజంపై వేసుకుని మంట వెలిగించుకుని నిజంగానే బాధను భరిస్తూ ఆ సీన్ ను పూర్తి చేశారు.చిరంజీవి అలా చేయడంతో సీన్ షూటింగ్ పూర్తైన తర్వాత సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు.రిస్కీ సన్నివేశంలో నటించడం వల్ల చిరంజీవి చేయి కాలడంతో పాటు బొబ్బ వచ్చింది.

చిరంజీవి తన సినీ కెరీర్ లో ఇలాంటి రిస్క్ లు ఎన్నో చేసి విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.అందువల్లే చిరంజీవి సినిమాలలో చేసే ఫైట్లు సైతం మనకు నాచురల్ గానే కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు