మెగా బ్రదర్స్‌ ఇద్దరూ ఫ్యాన్స్‌ ను ఊరిస్తున్నారు...

చిరంజీవి 10 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఖైదీ నెం.150 సినిమాను చేశాడు.

ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి చేశాడు.

సినిమాల విషయంలో చిరంజీవి ఈ రెండు మూడు ఏళ్లుగా చాలా స్లోగా ఉన్నాడు.ఖైదీ నెం.150 తర్వాత ఇప్పటి వరకు మూడు నాలుగు సినిమాలను స్పీడ్‌ గా చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది.ఇలాంటి సమయంలో చిరంజీవి చేస్తున్న ఆచార్యను కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేయాలని భావించారు.

కాని కరోనా కారణంగా ఏడాది అంతా కూడా పట్టింది.ఇంకా ఈ ఏడాదిలో పూర్తి అయ్యే దాఖలాలు కూడా కనిపించడం లేదు.

జరిగిన నష్టం ఏదో జరిగిందని భావిస్తున్న చిరంజీవి రాబోయే రెండేళ్లకు గాను ఏకంగా అయిదు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఇప్పటికే ఆచార్య తర్వాత వేదాళం సినిమాను చేయబోతున్నట్లుగా చిరంజీవి తెలియజేశాడు.

Advertisement

ఆ తర్వాత లూసీఫర్‌ రీమేక్‌ ను వివి వినాయక్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇక బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చిరంజీవి చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు.

ఈ సినిమాలు కాకుండా బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక భారీ యాక్షన్‌ మాస్ మసాలా సినిమాను చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట.ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక చిరంజీవితో పాటు పవన్‌ కళ్యాణ్‌ కూడా వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నాడు.పవన్‌ అజ్ఞాతవాసి తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.

దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా పవన్‌ ప్రేక్షకులకు దూరంగా ఉంటున్నాడు.అయితే ఆర్థిక అవసరాల నిమిత్తం సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పిన పవన్‌ వకీల్‌ సాబ్‌ చేస్తున్నాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమాకు కూడా ఓకే చెప్పాడు.ఈ సినిమాలు మాత్రమే కాకుండా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో, బండ్ల నిర్మాణంలో ఇలా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు.

Advertisement

ఇలా ఈ ఇద్దరు మెగా బ్రదర్స్‌ ఫ్యాన్స్‌ ను కొత్త ప్రాజెక్ట్‌ లతో ఊరిస్తున్నారు.

తాజా వార్తలు