దివ్యభారతి, దాసరి.. చింతామణి మధ్యలో ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

దివ్య భారతి. 1990వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమను కొంత కాలం పాటు ఊపు ఊపిన నటి.

 Why Chinthamani Movie Halted In Middle Details, Divya Bharathi, Chintamani Movie-TeluguStop.com

బొబ్బిలి రాజా సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అందాల సుందరి.రెండు సంవత్సరాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలింది.

తొలి సినిమాతోనే కనీ వినీ ఎరుగని రీతిలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

అక్కినేని నాగార్జున మినహా తెలుగు సినిమా పరిశ్రమలోని అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది.అంతేకాదు.

ఈ ముద్దుగుమ్మకు అప్పట్లో బాగా డిమాండ్ ఉండేది.అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునే వారు నిర్మాతలు.

అప్పట్లోనే రోజుకు లక్ష రూపాయల పారితోషకం తీసుకునేది దివ్య భారతి.అయినా తనకున్న క్రేజ్ మూలంగా నిర్మాతలు అడిగినంత ఇచ్చేవారు.

దివ్య భారతికి అప్పట్లో యూత్‌లో ఉన్న మంచి ఫాలోయింగ్‌ ను గుర్తించాడు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఆమెతో కలిసి ఓ సినిమా చేయాలి అనుకున్నాడు.

అందులో భాగంగానే చింతామణి అనే సినిమా తీయాలి అనుకున్నాడు.చింతామణి బాగా పాపులర్ అయిన నాటకం.

రంగస్థలం మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం.దీని గురించి తెలియని వారు లేరు అప్పట్లో.

అప్పటికే రెండు సార్లు సినిమాగా కూడా వచ్చింది.ఆ కథ గురించి, చింతామణి పాత్ర గురించి విన్న దివ్య భారతి ఈ సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తి కనబర్చింది.

Telugu Chintamani, Dasari Yana Rao, Divyabharathi, Divya Bharthi, Glamorus, Toll

1992లో దివ్య భారతి హీరోయిన్ గా చింతామణి సినిమా షూటింగ్ మొదలయ్యింది.రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు.అయితే ఇంతలోనే ఆమె ఆకస్మికంగా కన్నుమూసింది.దాసరి ఎంతో ఇష్టంగా తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది.అప్పటికి దివ్య భారతి వయసు 19 సంవత్సరాలు.తెలుగు, హిందీ సినిమా పరిశ్రమల్లో 20 సినిమాలకు పైనే చేసింది.

గ్లామర్ బ్యూటీ సడెన్ డెత్ అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమను విషాదంలో నింపింది.ఎంతో భవిష్యత్ ఉన్న నటీమణి మరణం పట్ల చాలా మంది సినీ పెద్దలు కంటతడి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube