నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదులే … నలుగురు నడిచిన దారిలో నేను అసలు నడవనులే అన్నట్టుగా ఆయన ఉంటాడు.ఏపీలో ఉన్న ఎమ్యెల్యేలంతా ఒక ఎత్తు అయితే… ఆయనొక ఎత్తు.
ప్రస్తుతం టీడిపీ ఎమ్యెల్యేలందరిలో చంద్రబాబు కి తలనొప్పిగా ఉన్న ఎమ్యెల్యే ఎవరైనా ఉన్నారా అంటే .ఒకే ఒక్కడుగా కనిపించే వ్యక్తి చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్.గత కొంత కాలంగా ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటున్నారు.ప్రతి వివాదంలోనూ దూరడం.పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం చింతమనేనికి నిత్యకృత్యంగా మారింది.ఈయన విషయంలో గట్టిగా మందలించలేక …కంట్రోల్ చేయలేక చంద్రబాబు సతమతం అవుతున్నాడు.
పోనీ చూసి చూడనట్టు వదిలేద్దామా అంటే… పార్టీ పరువు గంగపాలవుతోంది.

తాజాగా … తనపై వరుసగా వస్తున్న ఆరోపణల మీద ఎట్టకేలకు చింతమనేని స్పందించారు.నేను ఇాగే ఉంటా అంటూ వ్యాఖ్యానించిన చింతమనేని తాను చేస్తున్న మంచి పనులను ఎవరూ గుర్తించడం లేదని బాధపడిపోతున్నారు.విద్యార్థినికి రుణం ఇచ్చే విషయంలో మాజీ సర్పంచ్ తో ఇటీవల గొడవ పడ్డ చింతమనేని… ఇప్పుడు ఆ వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నందువల్లే తనకు సమస్యలు తెలుస్తున్నాయని, అందువల్లే ఆ సమస్యల మీద స్పందించాల్సి వస్తుందని చెబుతున్నాడు.

ఒకవేళ తాను చేస్తున్న పనుల వల్ల అధినాయకత్వానికి ఏదైనా బాధ కలిగితే తాను చెప్పుకుంటానని, అంతే తప్ప తన పద్ధతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోనని వ్యాఖ్యానించాడు చింతమనేని.కానీ మిగతా నాయకుల లాగా వందలకోట్లు వేలకోట్లు సంపాదించుకోవడం లేదని, కేవలం పేదవాడికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కలిగించిన వాడి మీద మాత్రమే దాడి చేస్తున్నానని తనని తాను సమర్థించుకున్నారు చింతమనేని.ఇదే విషయంపై వివాదంలో చింతమనేని కి వ్యతిరేకంగా ఉన్న సర్పంచ్ రంగారావు కూడా చింతమనేని ని సమర్థించుకుంటూ వచ్చారు.
చింతమనేని తనకు అన్నలాంటి వాడని, ఆయనతో నాకు ఇబ్బందులు ఏమీ లేవని ఆయన చెప్పుకొచ్చాడు అయితే చింతమనేని వ్యవహారం లో అధినేత మాత్రం ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాడు.