పీకే రిపోర్ట్ : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ జగన్ కు హెచ్చరిక ?

ఏపీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన హడావుడి చాలా కాలంగా జరుగుతూనే ఉంది.2023 లో తెలంగాణలో, 2024 లో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి.అయితే అంతకంటే ముందుగానే ముందస్తు ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారనే ప్రచారం చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది .టిఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ 2018 లోని ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు.అదే విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బిజెపి కాంగ్రెస్ లు మరింత బలం పెంచుకోకముందే తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నారు.

 Prasanth Kishor Report To Jagan And Kcr On Going To Early Elections Details, Tel-TeluguStop.com

ఇక ఏపీ సీఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో పార్టీ ఎమ్మెల్యేలను,  మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను జనాల్లోకి పంపుతున్నారని,  జగన్ కూడా నిత్యం జనాల్లో ఉండేలా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు,  పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం ఇవన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలు గానే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే పైకి మాత్రం అటు తెలంగాణ ప్రభుత్వం,  ఇటు ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెబుతున్నా,  అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తోంది.
  తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హెచ్చరికలు చేసినట్లు సమాచారం.

Telugu Ap Cm Jagan, Ap, Ap Tdp, Chandrababu, Pack, Strategy, Telangana, Ysrcp-Po

ఏపీ,  తెలంగాణ ప్రభుత్వాలు ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదని , లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రశాంతి కిషోర్ ఓ సర్వే రిపోర్ట్ ను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందించారట.ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ తెలంగాణలో విపక్షాలు అంతగా బలం పుంజుకోలేదు అని, రాబోయే రోజుల్లో అవి మరింత బలపడే అవకాశం ఉందని,  అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని,  సవివరంగా తన సర్వేలో తేలిన రిపోర్టును బయటపెట్టారట.అయితే ప్రశాంత్ కిషోర్ అందించిన రిపోర్ట్ పూర్తిగా బయటకు రాకపోయినప్పటికీ , ముందస్తు ఎన్నికలకు వెళ్ళకపోతే రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు అధికారం కి దూరం కావలసి వస్తుందనే  రిపోర్టు అందడంతో ఇప్పుడు కెసిఆర్ జగన్ కూడా అలర్ట్ అవుతున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి కేసిఆర్ జగన్ లు పార్టీ శ్రేణులను అలర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube