తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సీఎంను ఫైనల్ చేసే బిజీలో ఉంది.
అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఇదే తరుణంలో అక్కడ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.
ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని, మా పథకాలే మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తాయనే ధీమాతో ఉన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSRCP ) మంచి ప్లానింగ్ తో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దూసుకుపోయే విధంగా కనిపిస్తోంది.
కానీ టిడిపికే కష్టాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అధికారం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటు వంటి టిడిపి పార్టీ నాయకుడు నారా లోకేష్ గత కొన్ని నెలల నుంచి యువ గళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇదే తరుణంలో టిడిపి పార్టీకి సమాజ్ వాది పార్టీ ( Samajwadi party ) తలనొప్పిగా మారేటట్టు కనిపిస్తుంది.
సమాజ్ వాది పార్టీకి జాతీయ హోదా ఉంది.ఈ రెండు పార్టీల గుర్తు సైకిలే.ఇదే తరుణంలో ఏపీలో రాబోవు ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నట్టు చిన్నగా విషయం బయటకు వచ్చింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.
సమాజ్ వాది పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కార్యాలయం కూడా వెలిసినట్టు తెలుస్తోంది.
ఇవన్నీ చూస్తే మాత్రం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎస్పీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు.ఒకవేళ వాళ్ళు పోటీ చేస్తే, వారికి కేటాయించే గుర్తుపైనే గందరగోళం నెలకొని ఉంది.టిడిపి పార్టీకి సైకిల్ గుర్తే ఉంటుంది.
అలాగే సమాజ్ వాది పార్టీకి కూడా సైకిల్ గుర్తు ఉన్నది.ఇదే తరుణంలో సమాజ్ వాది పార్టీ పోటీ చేస్తే సైకిల్ గుర్తు కేటాయిస్తారని,అలా కేటాయిస్తే టీడీపీ ( TDP ) పార్టీ సైకిల్ పని ఖతం అవుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
దీంతో టీడీపీ నాయకులంతా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.కానీ ఎస్పీ ఇక్కడ పోటీ చేస్తే తప్పకుండా ఆ గుర్తు మారుతుందని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .ఎందుకంటే ఎన్నికల సంఘం దగ్గర ఎస్పి,టీడీపీ రెండు ప్రాంతీయ పార్టీల హోదానే కలిగి ఉన్నాయి.కాబట్టి ఈ పార్టీలకు ఒకే రకమైన గుర్తులు కేటాయించదు ఈసీ.కాబట్టి ఎస్పీ పార్టీకి గుర్తు మారే అవకాశం ఉన్నదని అంటున్నారు.