2011 నుంచి ఇప్పటివరకు భారత్ ను వదిలి వెళ్లిన వారి లెక్కలు బయటపెట్టిన కేంద్రం..!!

ప్రతి ఏడాది భారత్ నుండి ఇతర విదేశాలకు చాలామంది వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగిపోవడం తెలిసిందే.ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

 From 2011 Until Now, The Center Has Revealed The Figures Of Those Who Have Left-TeluguStop.com

ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఇండియాలో చాలా పరిస్థితులు దయనీయంగా మారాయి.ఇలాంటి తరుణంలో పార్లమెంటులో 2011 నుంచి ఇప్పటివరకు దేశాన్ని విడిచిన వారి లెక్క కేంద్రం బయటపెట్టింది.

Telugu America, Canda, Central, India-Telugu Political News

పూర్తి విషయాల్లోకి వెళ్తే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.2011 నుంచి ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు స్పష్టం చేశారు.అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకోవటం జరిగిందని పేర్కొన్నారు.2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఏడాది వారీగా భారత్ పౌరసత్వాన్ని వదులుకున్న సంఖ్య వివరించారు.

Telugu America, Canda, Central, India-Telugu Political News

2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 2022 లో ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు చెప్పారు.ఇదే సమయంలో భారతీయుల పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా వెల్లడించడం జరిగింది.అంతే కాదు గత మూడు ఏళ్లలో ఐదుగురు భారతీయులు యూఏఈ పౌరసత్వాన్ని పొందినట్లు జైశంకర్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube