మెడికల్ లీవ్‌ను మిస్యూజ్ చేసిన చైనా ఉద్యోగి.. రూ.73 లక్షలు గోవిందా..

ఈ రోజుల్లో టెక్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తీసేస్తున్నాయి.ప్రపంచ ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.

ఈ నేపథ్యంలో చైనాకి చెందిన ఒక ఉద్యోగి కంపెనీకి ఫేక్ లీవ్ ( Fake sick leave )పెట్టి విహారయాత్రకు వెళ్లాడు.ఈ విషయం కంపెనీకి తెలియడంతో అతడిని వెంటనే తొలగించింది.

దాంతో అతడు లబోదిబోమని ఏడుస్తున్నాడు.

అంతేకాదు ఇల్లీగల్‌గా తన జాబ్ తీసేసినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకు( Court ) ఎక్కాడు కానీ కోర్టు కూడా కంపెనీకి మద్దతుగా తీర్పును వెల్లడించింది.దాంతో చేసేదేమీ లేక తల పట్టుకున్నాడు.

Advertisement

వివరాల్లోకి వెళితే.

చైనీస్ టెక్ కంపెనీకి( Chinese tech company ) చెందిన జు అనే ఉద్యోగి తనకు మైకము, వెన్నెముక అనారోగ్యం తలెత్తిందని, అందుకే మెడికల్ లీవ్ కావాలని కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.అలాగే వైద్య సాక్ష్యాధారాలు అందించాడు.

అతనికి ఆరోగ్యం బాగోలేదన్న సంగతి నిజమేనని కంపెనీ రెండు వారాల సెలవుకు అనుమతి ఇచ్చింది.అయితే, అతను సెలవు కాలంలో తన బిడ్డతో కలిసి హైనాన్‌కు వెకేషన్ ట్రిప్ వేశాడు.

అతని సహోద్యోగుల్లో ఒకరు విమానాశ్రయంలో అతన్ని గుర్తించి, అతని అనారోగ్య సెలవును దుర్వినియోగం చేసినట్లు నివేదించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మోసం, నిజాయితీ లేని కారణంగా కంపెనీ అతనిని తొలగించింది, కానీ అతను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.మరోవైపు అతని కోరిక మేరకు రూ.73 లక్షల నష్టపరిహారం చెల్లించాలని లేబర్ ట్రిబ్యునల్ కంపెనీని ఆదేశించింది.అయితే ఉన్నత న్యాయస్థానం ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.

Advertisement

అతని తొలగింపును సమర్థించింది.బెడ్ రెస్ట్ తీసుకోవాలన్న తన డాక్టర్ సలహాను అతను పాటించలేదని, అందుకే కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడం సరైనదేనని కోర్టు అభిప్రాయపడింది.

తాజా వార్తలు