వింత జంతువును తయారు చేసిన చైనా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

చైనాకు ఉన్న ప్రత్యేకతలు మరో ఏ దేశానికీ ఉండవు.

ఏ దేశంలో ఎలాంటి టెక్నాలజీ వచ్చినా, దానికి డూప్ చేయడంలో చైనీయులు ట్యాలెంట్ అంతా ఇంతా కాదు.

ఇలాంటి అపప్రద ఉన్నప్పటికీ ఆ దేశం ఎన్నో రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తోంది.అగ్ర రాజ్యం అమెరికాకు ధీటుగా, సైనిక, టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, కంప్యూటర్ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది.

అయితే ఆ దేశం నుంచే కోవిడ్ వైరస్ పుట్టిందనే విమర్శలు ఉన్నాయి.అది ప్రపంచంలో ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసు.

ఎన్నో కోట్ల మంది కోవిడ్-19 వల్ల కోల్పోయారు.వివిధ వేరియంట్లు నేటికీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Advertisement

దీంతో ఆ దేశంలో ఏదైనా ప్రయోగాలు జరుగుతున్నాయంటే ప్రపంచం వణికిపోతోంది.తాజాగా ఆ దేశంలో ఓ వింత జీవి సంచారం చర్చనీయాంశంగా మారింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జిన్‌క్యాంగ్ వీధుల్లో వింత జాతి జీవి బహిరంగంగా తిరుగుతోంది.దీనిని కుక్క, పంది, ఇతర జీవుల కలయికతో కూడిన లక్షణాలు కనిపిస్తున్నాయి.ఇది సమీపంలోని వైద్య పరిశోధనా కేంద్రం నుండి తప్పించుకుందనే భయాన్ని స్థానికులలో రేకెత్తించింది.

దాని చర్మం వింతగా ఉంది.వెంట్రుకలు లేని శరీరంగా భయం గొల్పే ఆకారంతో యథేచ్ఛగా అది తిరుగుతోంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

దానికి పంది లక్షణాలు, కుక్క లక్షణాలు కలిపి కనిపిస్తున్నాయి.గులాబీ రంగు చర్మం, చారలతో ఇలా భయంకరంగా ఉంది.

Advertisement

ఇది ఏదో ఒక విధమైన జన్యు ప్రయోగంలో ఇలా మారిపోయి ఉంటుందనే వాదనలు ఉన్నాయి.స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.

ఇది వాస్తవానికి చైనీస్ క్రెస్టెడ్ హెయిర్‌లెస్ డాగ్ అని పిలువబడే జాతి అని నిర్ధారించారు.అది పూర్తిగా కుక్క అని తేల్చారు.

అయితే దాని ధర చాలా ఖరీదు అని వెల్లడించారు.కాలిఫోర్నియాలో జరిగే వార్షిక వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ పోటీలో గ్రహాంతర జాతి కుక్క తప్పకుండా పోటీదారుగా కనిపిస్తుంది.

తాజా వార్తలు