హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‎కు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు..!!

హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ కు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు చేరుకున్నారు.ఈ మేరకు స్కూల్ లో జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

కలెక్టర్ ఆదేశాలతో స్కూల్ కు వచ్చిన చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల స్టేట్ మెంట్ ను నమోదు చేయనున్నారని తెలుస్తోంది.అనంతరం ఘటనపై పూర్తి నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు సమర్పించనున్నారు.

మరోవైపు ఓఎస్డీ హరికృష్ణపై వచ్చిన ఆరోపణలను విద్యార్థినులు ఖండించారని తెలుస్తోంది.ఓఎస్డీ తమకు తండ్రి వంటి వారంటున్న స్టూడెంట్స్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపులంటూ వచ్చిన వార్తలు అవాస్తమని చెబుతున్నారని సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు