ఆదాశర్మ( Adasharma ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ ( Heart Attack )సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైన ఆదాశర్మ తొలి చూపులతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
అయితే ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఏవి అంత గుర్తింపు ఇవ్వలేకపోయాయి.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావడం తగ్గాయి.
ఇక తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
అయితే రీసెంట్ గా ది కేరళ స్టోరీ ( The Kerala Story )తో మంచి హిట్ అందుకుంది.
సరైన హిట్ కోసం పోరాడుతున్న ఈ బ్యూటీకి కేరళ స్టోరీ మంచి లైఫ్ ఇచ్చింది.దీంతో వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది.ఇక అందులో ఒకటి కమాండో వెబ్ సిరీస్ లో చేస్తుంది.ఈ సిరీస్ లో తను భావన రెడ్డి అనే పాత్రలో కనిపించనుంది.
ఇక ఈ సినిమా ఒక దేశభక్తి నేపథ్యంలో రూపొందుతుంది.
అయితే ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా గురించి చాలా విషయాలు పంచుకుంటుంది.ఈ సిరీస్ లో తన పాత్ర గురించి, జాతీయ వాదం గురించి చెప్పుకొచ్చింది.ఇంతకుముందు తనను కొంచెం యాక్షన్ సినిమాలోనే చూసుంటారని కానీ కమాండో మాత్రం అంతకుమించి యాక్షన్ సీన్స్ తో ఉంటుందని.
తనతో కూడా కూల్ యాక్షన్ సీన్స్ చేయించారని చెప్పుకొచ్చింది.
ఈ సిరీస్ జాతీయ భద్రతకు సంబంధించిందని.
దేశంలో జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా సోషల్ మీడియా( Social media )లో ట్వీట్ లు, పోస్టులు చేయడం ఆ దేశభక్తి కాదని తను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.ఇక తాము సినీ పరిశ్రమలో ఉన్నామని.
అందుకు ఒక నటిగా దేశభక్తి నిండిన కమాండో లో నటించే అవకాశం వచ్చిందని అందుకే చేశానని చెప్పుకొచ్చింది.
ఇక మనమందరం జీవిస్తున్న ఈ దేశం అంటే తనకు చాలా ఇష్టమని.ది కేరళ స్టోరీతో ప్రేక్షకులు తనకు మర్చిపోలేని విజయాన్ని అందించారని.అది తన జీవితంలో మంచి అనుభూతిని కలిగించిందని.
ఎప్పుడు ఎవరు చేయని విభిన్న పాత్రలు చేయగలిగానని.దీంతో ప్రేక్షకులు కూడా తనను అటువంటి పాత్రలో చూడాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.