లాలి లాలి అంటూ పాడిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉంది..?

మన దేశంలో ఎక్కువగా హిందువులు క్రిస్టియన్ మతంలోకి గాని, బుద్ధిజం మతం లోకి గాని కన్వెర్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము.

కానీ ముస్లిం మతం తీసుకునే వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు.

ఎఆర్ రెహమాన్, ఇళయరాజా కొడుకు అయిన యువన్ శంకర్ రాజా వంటి వాళ్లు ముస్లిమ్ మతం తీసుకున్నారు.అలాగే నటిగా మరీ ముఖ్యంగా బాల నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చే సమయంలో ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి, ముస్లిం మతం తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నది.

అంతేకాకుండా తనకి ఉన్న క్రెజ్ కూడా వద్దు అనుకుని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది.ఆమె మరెవరో కాదు సుహాసిని,మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇందిరా చిత్రంలో చిన్ననాటి ఇందిరా పాత్రను పోషించిన మౌనిక.

ఈమె అసలు పేరు రేఖ మారుతిరాజ్.ఈమె 1987, ఆగష్టు 27 న తమిళనాడులో జన్మించినది.

Advertisement
Child Artist Mounika Then And Now,tollywood,child Arist.mounika,marred Muslim Ra

ఈమెకి కృష్ణ, మౌనిక, రేఖ, పర్వాన, రహిమా అనే పేర్లు కూడా ఉన్నాయి.అలాగే ఈమె 1990 నుండి 1995 వరకు బాలనటిగా, 2001 నుండి 2014 వరకు లీడ్ రోల్స్ చేసింది.

ఆ తరువాత మలిక్ అనే వ్యక్తిని 2016 లో వివాహం చేసుకుంది.ఈమె మారుతి రాజ్, గ్రేసీ దంపతులకి జన్మిచినది.

తండ్రి హిందువు అయితే తల్లి క్రిస్టియన్.ఈమె 90 లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా,సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ కొనసాగించింది.

Child Artist Mounika Then And Now,tollywood,child Arist.mounika,marred Muslim Ra

అలాగే తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది.2014 లో ముస్లిం మతం తీసుకుంది.తన పేరుని MG రహిమాగా మార్చుకుని ఇంకా సినిమాలు చేయను అని సంచలన ప్రకటన చేసింది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఈమె భర్త చెన్నైకి చెందిన వ్యాపారవేత్త.అలాగే మదురై లో కూడా ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి.

Advertisement

అసలు మాలిక్ తో రహిమా కి ఎలా పరిచయం ఏర్పడిందంటే మాలిక్ తండ్రి, రహిమా తండ్రికి చాలా దగ్గర సన్నిహిత స్నేహితుడు.అలా ఇద్దరి తండ్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో మౌనిక, మాలిక్ ల మధ్య స్నేహ బంధం కాస్త పెరిగి వీళ్ళద్దరు వివాహం చేసుకునే దాక వచ్చారు.

ఈమె భర్త మాలిక్ ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేస్తూ ఉంటారు.తెలుగులో  శివరామరాజు , మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు.ఇంకా సినిమాలకు గుడ్ బై చెప్పి సంసార బాధ్యతలను నిర్వహిస్తుంది.

ఇలా క్రెజ్ ఉండగానే సినిమాలకు బాయ్ చెప్పటం నిజంగా ఆశ్చర్యకరమే చెప్పాలి.ఎందరో నటి నటులు గొప్ప వాళ్లు కావాలని కలలు కంటుంటే రహిమా మాత్రం మంచి అవకాశాలు వచ్చినాగాని సినిమాలకి దూరం అయ్యారు.

ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంటికే పరిమితం అయ్యింది రహిమా.హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినాగానీ చాలా పేరు సంపాదించుకుంది .

తాజా వార్తలు