తెలంగాణలో కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం..: రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.

ఆరు గ్యారెంటీలలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న ఆయన రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు.అలాగే పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు