ఏదైనా పని పట్టుకుంటే అది కాస్తా పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టకుండా అదే పనిలో నిమగ్నయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు కు ప్రస్తుత ఎన్నికల ఫీవర్ గట్టిగా పట్టుకుంది.అందుకే తన ఫోకస్ మొత్తం దానిమీదే పెట్టి మారే విషయం మీద శ్రద్ద పెట్టలేకపోతున్నాడు.
మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.అయితే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని బాబు బలంగా నమ్ముతున్నాడు.
దీని కోసం పార్టీ శ్రేణులను కౌంటింగ్‌కు సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడు.దీనిలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలను రద్దు చేసి నేతలకు కౌంటింగ్ పై విస్తృతంగా శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.
కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా పార్టీ నాయకులకు హెచ్చరికలు చేస్తున్నాడు
ప్రస్తుతం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలను ఈ నెల నాలుగో తేదీ నుంచి మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో నిర్వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆ సమీక్షలను చంద్రబాబు అర్ధాంతరంగా ముగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడకపోయినా కేబినెట్ భేటీ సందర్భంగా రేపు జరగాల్సిన కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష రద్దయింది.ఎల్లుండి నుంచి సమీక్షలు కొనసాగించాలని భావించినా.
కౌంటింగ్ కు సమయం తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో వాటిని రద్దు చేయాలని బాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అయితే బాబు నిర్ణయంపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.ఎన్నికల ఫలితాల తరువాత గెలుపోటములపై పార్టీలు సమీక్షలు నిర్వహించడం మాములే కానీ, టీడీపీ అధినేత మాత్రం పోలింగ్ రోజు పరిణామాలు, టీడీపీకి ఓట్లు పడ్డాయా లేదా అనే అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.వీటికి హాజరవుతున్న నేతల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.
వచ్చిన వారు కూడా క్షేత్రస్ధాయిలో టీడీపీకి ఓట్లు పడ్డాయో లేదో పూర్తిస్ధాయిలో చెప్పలేని పరిస్ధితి.దీంతో అధినేత చంద్రబాబు తన వద్దనున్న సర్వేలను నేతల ముందు ఉంచి వాటిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటువంటి సమీక్షలు పెట్టడం టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు అని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.ఇదే విషయం పై బాబు కి కూడా ఫీడ్ బ్యాక్ వెళ్లడంతో నియోజకవర్గాల సమీక్షలు రద్దు చేసి కౌంటింగ్ కు సంబంధించి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాడు.