తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి( Undavalli Sridevi ) టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది .2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా టిడిపి అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో వైసిపి అధిష్టానం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.ఆ తరువాత ఆమె టిడిపికి దగ్గరయ్యారు.ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయాన్ని బాబు వద్ద ప్రస్తావించగా, ఆమె రాకను చంద్రబాబు స్వాగతించారు.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తాననే హామీను కూడా చంద్రబాబు ఇచ్చారు.
బాపట్ల లోక్ సభ టికెట్ ను ఖరారు చేస్తున్నట్లు ఆమెకు చెప్పగా , తాడికొండ, లేదా పత్తిపాడు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని శ్రీదేవి కోరారట.తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్లీ తాను గెలుస్తాననే నమ్మకంతో శ్రీదేవి ఉన్నారు .కానీ చంద్రబాబు ఆ సీటు ఇచ్చేందుకు నిరాకరించారట.దీనికి కారణం అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్( Sravan kumar ) కు ఇప్పటికే టికెట్ ఖరారు చేయడంతో కుదరదని తేల్చేశారట.
పోనీ ప్రత్యామ్నాయంగా పత్తిపాడు నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వాలని కోరినా, అక్కడ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పోటీకి దింపాలని చంద్రబాబు ఎప్పుడో ప్లాన్ చేశారు.దీంతో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గం శ్రీదేవికి ఛాన్స్ లేనట్లే అయింది.
బాపట్ల ఎంపీగానే పోటీ చేయాలని చంద్రబాబు సూచించడంతో శ్రీదేవి ఆలోచనలు పడ్డారట.
ప్రత్తిపాడు , లేదా తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశలు పెట్టుకోగా, బాపట్ల ఎంపీగా టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు( Chandrababu Naidu ) హామీ ఇవ్వడంతో ఈ విషయంలో శ్రీదేవి ఆలోచనలు పడ్డారట ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా వైసీపీకి చెందిన నందిగామ సురేష్ ఉన్నారు.అక్కడ సీనియర్ నేత శ్రీరామ్ మల్యాద్రిని ఓడించి ఎంపీగా సురేష్ గెలిచారు.ప్రస్తుతం శ్రీరామ్ మల్యాద్రి అంత యాక్టివ్ గా ఉండడం లేదు.
దీంతో ఆ సీటు శ్రీదేవికి ఇవ్వాలనే ఆలోచనలు చంద్రబాబు ఉన్నారు.అంతేకాకుండా నందిగామ సురేష్ , శ్రీదేవికి మధ్య రాజకీయ వైరం కూడా ఉండడంతో ఆమెను అక్కడ పోటికి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేశారట.