వెక్కిరిస్తున్న ఖజానా ? అధికారులపైనే జగన్ భారం ?

చేతికి ఎముకే లేదు అన్నట్లుగా జగన్ వరుసగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ, సంతకాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.జగన్ అమలు చేసేవి అన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలు.

 Ys Jagan Govt Makes Ap Financial Crisis Worst, Ap Financial Crisis,ys Jagan Govt-TeluguStop.com

కరోనా కష్టకాలంలో జనాలను ఆదుకునేందుకు, తన పరిపాలన స్వర్ణయుగంగా చెప్పుకునేలా చేసేందుకు జగన్ తాపత్రయ పడుతూ, పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు.తాను చేపట్టిన పాదయాత్ర లో ప్రజల కష్టాలను కన్నీళ్లను దగ్గరగా చూశానని,  తాము అధికారంలోకి వస్తే ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా సరికొత్త పథకాలను రూపొందిస్తాను అంటూ జగన్ హామీలు ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసి చూపిస్తున్నారు.అయితే జగన్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం భారీ బడ్జెట్ తో కూడుకున్నది కావడం,  దీనికోసం వేలాది కోట్లు కుమ్మరించాల్సి వస్తుండడం, ఖర్చు తప్ప ఆదాయమే లేదు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి నెలకొనడం , దీనికి తోడు కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవడం, ఇలా ఎన్నో సమస్యలు జగన్ ను చుట్టుముట్టాయి.
పోనీ తాను ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేద్దామంటే జనాల తో పాటు, ప్రతిపక్షాలు హేళన చేస్తాయనే ముందుచూపుతో ఏ పథకాన్ని మధ్యలో ఆగిపోకుండా జగన్ చూసుకుంటున్నారు.అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఖజానా నిండుకుంది.

ప్రతినెల ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టంగా మారిపోయింది.పోనీ కేంద్రం ఏమైనా సహకరిస్తుందా అంటే పూర్తిగా కక్షసాధింపు ధోరణితో ఉన్నట్టు గా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఏపీకి అప్పులు కూడా పుట్టే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో జగన్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

ఏపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కాకముందే,  ఈ పరిస్థితి ఉండడంతో రాబోయే రెండున్నరేళ్ల ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది జగన్ కు పెద్ద సవాలుగా మారింది.దీంతో ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు  , ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు జగన్ నడుంబిగించారు.

Telugu Ap Cm Jagan, Ap Debts, Ap Financial, Apfinancial, Ap, Chandrababu, Jagan,

ఈ మేరకు ఎప్పుడూ లేని విధంగా  కలెక్టర్లకు , కీలక శాఖల అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని , ప్రతివారం కలెక్టర్లు ముఖ్యమైన శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆర్థిక వనరులను ఏ విధంగా పెంచాలని విషయంపై చర్చించాలని, అలాగే ఆదాయం వచ్చే ప్రభుత్వ శాఖల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఎక్సైజ్,  స్టాంపు డ్యూటీ స్, రిజిస్ట్రేషన్ వంటి శాఖలు విషయంలో మరింత దృష్టి సారించాలని,  ఏదోరకంగా ప్రభుత్వ ఖజానా ను నింపే మార్గాలను అన్వేషించాలి అంటూ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube