దెబ్బకొట్టిన అమిత్ షా ! ఆందోళనలో టీడీపీ ?

తానొకటి తలిస్తే దైవం మరొకటి  తలచింది అన్నట్టుగా తయారయ్యింది టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి .

ఏదో రకంగా 2024 నాటికి బిజేపి తో పొత్తు పెట్టుకుని జనసేన,  బిజెపి సహకారంతో ఏపీలో అధికారంలోకి రావాలి అనే ఎత్తుగడతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.

ఒక పక్క ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తునే మరోవైపు బిజెపి పెద్దలను ఒప్పించే పనిలో బాబు నిమగ్నమయ్యారు.అయితే బాబు ఆశలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నీళ్లు చల్లేసారు.

అంతేకాదు పెద్ద ఎత్తున ఇతర పార్టీల లోని నేతలను చేర్చుకోవాలని ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా క్లాస్ పీకడం తో  ఇప్పుడు పొత్తు  సంగతి పక్కన పెట్టి , పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురయింది.      ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు ఉంటుందని చంద్రబాబు భావించారు.

  దీనికి తగ్గట్లుగానే బిజెపి విషయంలో సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు.కానీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బిజెపి నేతలను ఉద్దేశించి టిడిపి వైసిపి లను శత్రువులు గానే చూడాలని జనసేన తోని కలిసి ముందుకు వెళ్లి  ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.

Advertisement

దీంతో ఇప్పుడు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్  మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం వైసిపి అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎవరు బిజెపిలోకి వెళ్లే అవకాశమే లేదు.

జనసేన బిజెపికి మిత్రపక్షంగా ఉంది .దీంతో ఆ పార్టీ నుంచి చేరికలు ఉండవు.ఇక మిగిలింది టీడీపీనే. 

   టిడిపి నాయకులను బీజేపీలో చేరే విధంగా ఏపీ బీజేపీ నేతలు అప్పుడే దృష్టి సారించడంతో,  టిడిపి లోని అసంతృప్త నాయకులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరితే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది అనే టెన్షన్ లో టిడిపి అదినేత చంద్ర బాబు ఉన్నారట.కేంద్రంలో ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా  ఉండడంతో,  ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేందుకు చంద్రబాబు సాహసించడం లేదు .ఇక టిడిపి లో సరైన ప్రాధాన్యం లేక అసంతృప్తితో ఉన్నవారు భవిష్యత్ లో టిడిపి పరిస్థితిని ముందుగా అంచనా వేస్తున్నారు బిజెపి లోకి వెళ్లడమే మంచిది అన్న ఆలోచనలో ఉండడంతో,  పెద్దఎత్తున నాయకులు బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.దీంతో అసంతృప్త నాయకులను బుజ్జగించి,  పార్టీ మారకుండా అప్పుడే చంద్రబాబురంగంలోకి దిగిపోయారట.

అమిత్ షా ఏపీ పర్యటనలో టిడిపితో పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్న సమయంలో ఆయన సొంత పార్టీ నేతలకు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు లో ఆందోళనను బాగా పెంచేస్తున్నాయి.

కేసీఆర్ కవిత సైలెన్స్ .. బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ? 
Advertisement

తాజా వార్తలు