చంద్రబాబు ఊహలు.. జగన్ సర్కార్ కూలిపోయే ఛాన్స్ ఉందట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తైంది.

ఈ 15 నెలల పరిపాలన కాలంలో జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 90 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చారు.

మిగిలిన హామీలను సైతం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు.కరోనా, లాక్ డౌన్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సీఎం జగన్ పథకాల అమలు విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఏపీ ప్రజలు సైతం జగన్ పాలన పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో వైసీపీ రోజురోజుకు బలపడుతోంటే టీడీపీ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారుతోంది.

అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో జగన్ సర్కార్ కూలిపోతుందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.తాజాగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఏపీలో త్వరలో ఎన్నికలు రావడం ఖాయమని.ఏ క్షణం ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు.

/br> జగన్ గంటకు 9 కోట్ల రూపాయల అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడని.ఉచిత విద్యుత్ విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట గుదిబండగా మారిందని తెలిపారు.

జగన్ సర్కార్ మోటార్లకు మీటర్లు బిగించే జీవో నంబర్ 22ను వెంటనే రద్దు చేయాలని అన్నారు.జగన్ కు రాష్ట్రం బానిస కాదని వైసీపీ నయవంచన రోజుకొకటి బయటపడుతోందని తెలిపారు.

చంద్రబాబు వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నెటిజన్లు మాత్రం చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని ఆ కలలు ఎప్పటికీ నిజం కావని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు