జక్కన్నకే జర్క్ ఇచ్చిన చంద్రబాబు  

Chandrababu Rejected Rajamouli Suggestions-

 • అదేదో సినిమాలో మా వాడకం ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా అనే డైలాగు ఉంటుంది.అసలు డైలాగులు వ్యక్తుల నుంచీ పుడతాయి.

 • జక్కన్నకే జర్క్ ఇచ్చిన చంద్రబాబు -

 • అయితే ఈ డైలాగు మాత్రం చంద్రబాబు నుంచీ పుట్టింది అంటున్నారు సామాన్య ప్రజలు.చంద్రబాబుకి ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

 • ఆయనకీ తెలిసినంతగా మరెవరికీ ఈ లెక్కలు తెలియదు.ఎన్నికల సమయంలో జూ.

 • ఎన్టీఆర్ ని.అవసరం అనుకున్నప్పుడు బాలకృష్ణ.

 • హరికృష్ణ లని.పార్టీ ఫండ్ కోసం వ్యాపారవేత్తల్ని ఎలా కావాలంటే అలా వాడేస్తూ ఉంటారు అని టాక్.

 • అయితే ఈ వాడుకలో పాపం బాహుబలి జక్కన్న కూడా బలై పోయాడు అని టాక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొట్టేస్తోంది.

  అసలు ఏమి జరిగింది అనేది పరిశీలిస్తే…బాహుబలి రేంజ్ కంటే మరింత ఎక్కువ రేంజ్ లో అమరావతి నిర్మాణం జరగాలి అని బాహుబలి ని చెక్కిన జక్కన్నని బాబు గారు పిలిపించారు.డిజైన్లు మీ చేతుల్లోనే రూపొందాలి అంటూ చెప్పి భాద్యత తన మీద పెట్టారు…మరి ముఖ్యమంత్రి అడిగితే కాదంటాడ జక్కన్న.సరే అంటూ రాజమౌళి కూడా రెండుసార్లు లండన్ వెళ్లి వచ్చారు.

 • ఎందుకంటే రాజమౌళి డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ పోస్టర్ ఉండేది లండన్లోనే కాబట్టి. బాబు తో ఈ విషయంలో ఈ డిజైన్ల విషయం చర్చించారు తర్వాత అనేక సమావేశాల తర్వాత, డిజైన్లకు మార్పులు, చేర్పుల తర్వాత బుధవారం అసెంబ్లీకి సంబంధించిన ఓ డిజైన్ ను 99 శాతం చంద్రబాబు ఖరారు చేశారు.

  అయితే సిఆర్డీఏ ఆధ్వర్యంలో చంద్రబాబు పెద్ద సమావేశమే నిర్వహించి డిజైన్లపై కూలంకుషంగా చర్చించి చివరకి రాజమౌళి సూచనలని పక్కకు నెట్టేసి నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన టవర్ ఆకారంలో ఉన్న అసెంబ్లీ భవనం డిజైనే బాగుందని తేల్చేశారు మరి ఇప్పటి వరకూ ఈ విషయంలో రాజమౌళి ఇచ్చిన సలహాలు ఏమయ్యాయి అంటే?.

 • పోనీ రాజమౌళి సూచనలేమైనా నార్మన్ ఫోస్టర్ తన డిజైన్లలో ప్రతిబింబించారా అంటే అదీ లేదు. మరి డిజైన్లలో రాజమౌళి పాత్ర ఏముంది? అంటే ఆ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు.

 • కానీ అందరికీ అర్థం అయ్యిన విషయం ఏమిటి అంటే అమరావతి కోసం.తన పేరుకోసం జక్కన్నే షాక్ అయ్యే రేంజ్ లో రాజమౌళిని వాడేశాడు చంద్రబాబు అని టాక్.

 • ఇదే విషయమై రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.తెలుగుతల్లి స్ధూపాన్ని ఏర్పాటు చేయాలని తాను చేసిన సూచనకు సమావేశం దాదాపు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు.

 • అసెంబ్లీ డిజైన్ కూడా దాదాపు ఖారారయ్యింది.తెలుగు తల్లి విగ్రహం పైకి సూర్య కిరణాలు నేరుగా పడేలా జక్కన్న డిజైన్ చేశారట.

 • మరి ఈ డిజైన్లో అయినా సరే బాబు గారు జక్కన్న సూచనలు ఆచరణలో పెడుతాడో లేదో చూడాలి మరి.