Chandrababu Naidu: మళ్ళీ నందమూరి చేతుల్లోకి టీడీపీ.. కలత చెందుతున్న చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మంచికైనా, చెడుకైనా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు.

  ప్రధానమంత్రులు, అధ్యక్షులను కూడా నియమించగల సామర్థ్యం తనకు ఉందని గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు  ఇప్పుడు  తన రాజకీయ  జీవితంలో  అంత్యంత క్లిస్టమైన పరిస్థితుల్లో ఉన్నారు.

  పోలిటీకల్ కెరీర్ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న చంద్రబాబు తన వారుసుడు విషయంలో తీవ్ర ఆసంతృప్తి ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుకు లోకేష్ రాజకీయంగా పనికిరాడనే విషయం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది.

 లోకేష్ తన అజ్ఞానాన్ని, రాజకీయ తెలివితేటలు ప్రతి సందర్భంలోనూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వచ్చాయి.  ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికవ్వలేదు  తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నామినేషన్‌‌గా  మంత్రి పదవుల్లో కొనసాగారు.

ప్రస్తుతం పార్టీ బాధ్యతలు తన కొడుకు లోకేష్ అప్పజెప్పే విషయంలో అటు నందమూరి, ఇటు పార్టీ నాయకుల నుండి వ్యతిరేకత వస్తున్నట్లుగా తెలుస్తోంది.దీంతో చంద్రబాబు మల్లాగుల్లాలు పడుతున్నారు.

Advertisement
Chandrababu Naidu Worst Phase Of Life At Present Details, Chandrababu Naidu,nara

తన వారసత్యంపై పార్టీలో నమ్మకం లేకపోడంపై చంద్రబాబు కలత చెందుతున్నారని సన్నిహితుల ద్వాారా సమాచారం.

Chandrababu Naidu Worst Phase Of Life At Present Details, Chandrababu Naidu,nara

14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా  ప్రజలను పాలించిన చంద్రబాబు లోకేశ్‌కు రాజకీయ పాటలు నేర్పే విషయంలో శ్రద్ద చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ప్రజల్లో లోకేశ్‌పై వ్యతిరేకత ఉన్న కారణంగా పార్టీ అభ్యర్థులు కూడా ఆయన్ను  ప్రచారాలకు పిలవడం లేదు.ప్రస్తుతం లోకేష్ చేపట్టబోయే యాత్రకు కూడా మిశ్రమ స్పందన వస్తుంది.

లోకేష్ కన్నా బాలయ్య లేదా చంద్రబాబు యాత్ర చేస్తే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.చంద్రబాబు తర్వాత టీడీపీ మళ్ళీ నందమూరి కుటుంబం చేతికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ తరుణంలో టీడీపీలో నారా శకం ఇక ముగిసినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు