బాబు గేలం వేస్తున్నాడు ... పవన్ భయపడుతున్నాడు ! ఏంటి ఈ కొత్త ఎత్తు

ఈ ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కే అవకాశాలు కనిపించకపోవడంతో.

ఇప్పుడు బాబు ఆలోచనలో పడ్డాడు.

చంద్రబాబు రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాడు.అందుకే ఎక్కడ ఏ ఎత్తు వేయాలో బాగా తెలుసు.

అందుకే ఎప్పటికప్పుడు చురుగ్గా వ్యవహరిస్తూ.కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలో తన మీద ముప్పేట దాడికి దిగుతున్న వారి మీద భారీ విమర్శలు గుప్పిస్తూ.పార్టీ కీడెర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

అందుకే.మోడీ, మిడిల్ మోడీ కేసీఆర్, జూనియర్ మోడీ జగన్ అంటున్నారు కానీ.

పవన్ మోడీ కి లింక్ పెట్టకుండా జాగ్రత్తపడ్డాడు.దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే కనిపించింది.

పవన్ కల్యాణ్ విషయంలో బాబు ఇప్పుడు మెతక వైకిరి అవలంబిస్తున్నాడు.పవన్ ని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకునేందుకు చూస్తున్నాడు.అందుకే ఇప్పటికిప్పుడు వ్యూహం మార్చుకున్నారన్నమాట.

పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే.ఆయన తమతోనే ఉండేవారన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే ఇప్పుడు వ్యక్తం అవుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే30, గురువారం 2024
శంకర్ భారతీయుడు 2 సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడా..?

పవన్ కల్యాణ్‌ విషయంలో చంద్రబాబు.సాఫ్ట్‌గానే వ్యవహరించారు.

Advertisement

అయితే.ఆయనను టీడీపీ సరిగ్గా పట్టించుకోలేదు అనే అభిప్రాయం టీడీపీ సీనియర్ నేతల్లోనే ఉంది.

అసలు చంద్రబాబు వ్యూహం అంతా.మోడీని మళ్లీ ప్రధానిని కాకుండా చేయడమే .అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలుస్తామనే వాదన తెరపైకి తెస్తున్నారు.అదే సమయంలో.

ఏపీలో పొత్తుల కోసం ఓ పార్టీ కావాలి.అందుకే ఆయన జనసైన వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో బాబు ని ఓడించడానికి బీజేపీచాలా పెద్ద వ్యూహాలే రచిస్తోంది.ఇందులో భాగంగా జగన్, పవన్ లను కలిపే ప్రయత్నం చేస్తోంది.వీరిద్దరూ కలిస్తే.

చంద్రబాబు ఇంట్లో కూర్చోవాల్సిందే.అందుకే బాబు ఇప్పుడు బాబు మైండ్ గేమ్ ఆడుతున్నాడు.

గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు.చంద్రబాబునాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చార్జిషీట్లు వేశారు.అయితే ఆ తర్వాత చంద్రబాబు.

ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.ఇప్పుడు.

కాంగ్రెస్ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలో పొగడాలో తెలియక సతమతమవుతున్నారు.ఇప్పుడు అదే వ్యూహాన్ని జనసేనపై కూడా అమలు చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇలా చేయడం ద్వారా.పవన్ అభిమానుల్లో ఇప్పుడు టీడీపీని పొగడాలా.

తిట్టాలా అనే తీవ్ర గందరగోళం సృష్టించేందుకు బాబు ఈ ఎత్తుగడ వేసినట్టుగా అర్ధం అవుతోంది.

తాజా వార్తలు