టీడీపీ పొలిట్ బ్యూరోలోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ ఉండబోతోందా

నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో నారా- నందమూరి కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ కొంతమేర తగ్గింది.

గతంల టీడీపీ లో యాక్టివ్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు కావాలనే దూరం పెట్టాడు.

అలాగే నందమూరి హరికృష్ణ కు కూడా పార్టీలో ప్రాధాన్యం కల్పించినట్టే కల్పించి దూరం పెడుతూ వచ్చాడు.ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అది కూడా పేరుకు మాత్రమే.

ఆ కాస్త దూరం కూడా పెరిగి అలా అలా ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది.కానీ ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గించి నందమూరి కుటుంబాలకు మరింత దగ్గరయ్యి లాభపడాలనే ఆలోచనలో బాబు ఉన్నాడు.

ఇప్పుడు ఏపీ లో ఉన్నరాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉండే పరిస్థితి ఉంది.ఈ దశలో ఎవరో ఒక సెలబ్రెటీ అవసరం టీడీపీ కి బాగా అవసరం.అందులోనూ మహిళల్లోనూ మంచి క్రేజ్ ఉన్న యుంగ్ ఎన్టీఆర్ అయితే ఓటర్లు బాగా ప్రభావితం అవుతారని, పార్టీ గెలుపు సులువు అవుతుందని బాబు లోచన.

Advertisement

అందుకే జూ.ఎన్టీఆర్ కి పార్టీ లో సముచిత స్థానం కల్పించి రాజకీయ లబ్ది పొందాలని బాబు ప్లాన్ చేస్తున్నాడు.దీనివల్ల నందమూరి అభిమానుల్లో టీడీపీ పై సానుకూలత పెరుగుతుందని, అంతే కాకుండా బాబు పై ఇప్పటివరకు ఉన్న చెడు అభిప్రాయం కూడా పోయి పార్టీకి ప్లస్ అవుతుందనే బాబు భావిస్తున్నాడు.

అందుకే ఎన్టీఆర్ కు పొలిట్ బ్యూరోలో పదవి ఇవ్వాలని, హరి స్థానాన్ని తారక్ తో భర్తీ చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నట్టు గా టీడీపీ లో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.హరి స్థానంలోకి ఎన్టీఆర్ ని తీసుకోవడం వల్ల ఒకవైపు సెంటిమెంట్, మరో వైపు టీడీపీ మైలేజ్ పెరిగి గెలుపు సులువు అవుతుందని బాబు లెక్కల్లో తేలిందట.అందుకే ఈ ప్రతిపాదన త్వరలో ఎన్టీఆర్ ముందు ఉంచబోతున్నట్టు దానికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారకంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంత సాహసానికి బాబు వడిగడుతున్నా .లోలోపల మాత్రం భయంగానే ఉంది.పార్టీలో జూనియర్ ప్రభావం పెరిగితే ఆ తరువాత లోకేష్ కి ఇబ్బంది ఏర్పడుతుందని.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ని చేరదీయక తప్పని పరిస్థితి బాబుకి ఏర్పడింది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు