పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో లు.. ఎప్పటి నుంచంటే..?

ఏమి అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు వెళ్తోంది .

ఆ పార్టీ అధినేత జగన్ సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలతో నిత్యం జనాల్లో ఉంటున్నారు.

గత పది రోజులుగా ఆయన వెయ్యి కిలోమీటర్ల మేర బస్సు యాత్రను నిర్వహించారు.ఎన్నిక సమయం వరకు ఇదేవిధంగా ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు .టిడిపి , జనసేన( TDP Janasena ) కూడా పూర్తిగా జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్ప టివరకు జనసేన, టిడిపి,  బీజేపీలు విడివిడిగానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.

వారాహి యాత్ర ద్వారా పవన్( Pawan Kalyan ) ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇదే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించే విషయంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికల సమయం బాగా దగ్గరపడింది.

Advertisement

ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ప్రజల నుంచి స్పందన మెరుగ్గా ఉంటుందని,  వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదనే లెక్కల్లో ఉన్నారు.దీనిలో భాగంగానే ఈనెల 10 11వ తేదీల్లో ఉభయగోదావరి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం( Election Campaign ) నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతూ ప్రచార కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

అడపాదడప మాత్రమే వస్తున్నారు.అయితే ఎవరికి వారు విడివిడిగా ఎన్నికల ప్రచారం కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల పెద్దగా జనాల నుంచి స్పందన రావడంలేదని,  ఇది కూటమిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.దీంతో ఇక పై రోడ్ షోలు,  పర్యటనలు, బహిరంగ సభలు వంటి అన్ని ప్రచార కార్యక్రమాలు కలిసికట్టుగా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  దీనిపై మరోసారి చర్చించి రూట్ మ్యాప్ ను రెఢీ చేసుకోబోతున్నారు.అయితే ఏ విషయంలో బిజెపి( BJP ) ఏ నిర్ణయం తీసుకుంటుంది .ఏ విధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!
Advertisement

తాజా వార్తలు