టీడీపీ లో ' తారక్ ' మంత్రం ! వారి బాధ తీర్చేదెవరు ? 

తెలుగుదేశం పార్టీ కి మళ్ళీ పునర్వైభవం రావాలి అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ కావాలి అనే వ్యాఖ్యలు ఇప్పటివి కాదు.

ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి.

కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేకపోయినా, ఆయన వయస్సు మీరడం, గతంలో మాదిరిగా యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకోకపోవడం,  అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో కారణాలతో చంద్రబాబు గతంతో పోలిస్తే కాస్త సైలెంట్ అయ్యారు.

ఆయన తరఫున అన్ని బాధ్యతలు లోకేష్ చూసుకుంటున్నారు.ఆయన తనపై ఉన్న ముద్రను చేరుపుకుని చంద్రబాబు స్థాయి వ్యక్తి గా ముద్ర వేయించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

లోకేష్ శక్తి సామర్థ్యాలపై పార్టీ నేతలకు నమ్మకం పెరిగినట్టుగా కనిపిస్తున్నా, ఆ బలం సరిపోదని, లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగల శక్తిసామర్థ్యాలను సంపాదించుకోలేక పోయారు అని, ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతికి బట్ట కడుతుంది అనే నినాదాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడం తో ఎక్కడ పర్యటనకు వెళ్లినా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం, ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం, ఇవన్నీ లోకేష్ చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారాయి.పార్టీ నాయకులు, ప్రజల డిమాండ్ మేరకు టిడిపిలో ఎన్టీఆర్ యాక్టీవ్ అయ్యేలా ప్రోత్సహిద్దాం అంటే పూర్తిగా లోకేష్ ప్రభావం పార్టీలో తగ్గిపోతుందని, ఎన్టీఆర్ ప్రభావం పెరిగితే రాబోయే రోజుల్లో లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు ఉండటంతోనే , పార్టీ నేతల నుంచి ఎంతగా ఒత్తిడి వస్తున్న,  చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ను యాక్టివ్ చేసే విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకునేలా కనిపించడం లేదు.

Advertisement

కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే వస్తే లోకేష్ కు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది.లోకేష్ గతంతో పోలిస్తే అన్ని విషయాల్లోనూ మెరుగైనట్టుగా కనిపిస్తున్న, పార్టీ బాధ్యతలు పూర్తిగా ఆయన సమర్థవంతంగా మోయగలరా అనే అభిప్రాయం ఉన్నా, పదేపదే ఎన్టీఆర్ ప్రస్తావన రావడమే లోకేష్ చంద్రబాబులకు బాధ కలిగిస్తోందట.

వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?
Advertisement

తాజా వార్తలు