వైసీపీ పై ఈసీ కి ఫిర్యాదు చేసిన చంద్రబాబు..!!

తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలు ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉదయం 7 గంటల నుండి 7:00 వరకు జరగనున్న ఉప ఎన్నికలలో భారీగా ఓటర్లు పాల్గొంటున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వరికి వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇలాంటి తరుణంలో టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.విషయంలోకి వెళితే ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని అంటూ ఈసీ కి లెటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతాలలోకి పొరుగు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన వాళ్లు ఓటు వేయడానికి వస్తున్నారని చంద్రబాబు ఈసీ కి ఫిర్యాదు చేశారు.అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్టుల దగ్గర నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపించారు.

టోటల్ గా ఈ ఉప ఎన్నికలలో గెలవడం కోసం వైసీపీ రిగ్గింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, అందువల్లే పుంగనూరు నుంచి బస్సులో భారీగా జనాలను తరలిస్తున్నారు అంటూ లెటర్ లో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ కి తెలియజేశారు.

Advertisement
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తాజా వార్తలు