జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన కేంద్రం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరద ప్రాంతాల్లో.జగన్ ప్రభుత్వం పని తీరు అద్భుతమని కేంద్ర బృందం ప్రశంసల వర్షం కురిపించింది.

రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిం చడం జరిగింది.అనంతరం సోమవారం సీఎం జగన్ తో.

భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలను పరిశీలించి కేంద్ర బృందం సీఎం జగన్ కి వివరించడం జరిగింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్ధి వివరాలను అందించారు.ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంలో.

Advertisement

కునాల్ సత్యార్ధి మాట్లాడుతూ మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామనీ, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయనీ, పశువులు చనిపోవడం జరిగిందన్నారు.

తమ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమన్నారు.

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న.డ్యాములు మరియు రిజర్వాయర్లు.

వరదలను ఎదుర్కొనే అంతా కెపాసిటీ కలిగినవి కావని.అదే రీతిలో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని స్పష్టం చేశారు.సరిగ్గా రైతుల పంట చేతికందే సమయంలో.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

వరదల రావటంతో పంట నీటి పాలు కావడం జరిగింది అని పేర్కొన్నారు.ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాలలో అధికారుల పనితీరు చాలా బాగుందని ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు